ఉత్కంఠభరితంగా సాగుతున్న బిగ్‌బాస్ సీజన్- 8 నుంచి ఈ వారం జబర్దస్త్ నటుడు అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయాన్ని వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో ఈ సీజన్లో నాలుగో రన్నరప్‌గా అవినాష్ నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. టైటిల్ బరిలో గౌతమ్, నిఖిల్, ప్రేరణ మిగిలారు. అయితే వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనేది బిగ్‌బాస్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.