జబర్ధస్ (Jabardhas) కామెడీపో ద్వారా తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్న వారిలో వినోద్ అలియాస్ వినోదిని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలను పంచుకున్నారు. తన హెల్త్ బాగాలేనప్పుడు జబర్దస్త్‌లోని సహ నటులైన చమ్మక్ చంద్ర(Chammak Chandra), అభి, రాకేశ్, గెటప్ శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ వంటివారందరూ తనకు సాయం చేసి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. అయితే, తనంత తానుగా ఎవరినీ సాయం అడగలేదని పేర్కొన్నాడు. ఇంటి కోసం జరిగిన గొడవలో తన చేయి విరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విషయంలో హామీ (Surity) గా ఉండడం ద్వారా రూ. 5 లక్షలు నష్టపోయానని వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తన అనారోగ్యం గురించి తెలుసుకుని వారే ముుందుకు వచ్చి సాయం అందించారన్నాడు. తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి నటి రోజా (Actress Roja) కూడా సాయానికి ముందుకొచ్చారని తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పాడు. ఈవెంట్స్ చేయడంతోపాటు త్వరలోనే జబర్దస్త్ షోకి తిరిగి వస్తానని పేర్కొన్నాడు. తన ఆరోగ్యం(Health)బాగాలేకపోవడానికి చేతబడి కారణమని చాలామంది అనుమానం వ్యక్తం చేయడంతో దాని కోసం కూడా చాలా ఖర్చు చేశానని, మరోవైపు, ఆసుపత్రిలో ఖర్చులు కలిసి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశానని చెప్పుకొచ్చాడు.