»Tamil Nadu Petrol Bomb Commotion On Raj Bhavan Where
Tamil Nadu: రాజ్‌భవన్‌పై పెట్రోల్ బాంబు కలకలం.. ఎక్కడంటే?
చెన్నైలో రాజ్‌భవన్‌పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబ్ విసిరిన ఘటన కలకలం రేపింది. వెంటనే పోలీసులు బాంబ్ విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఎందుకు పెట్రోల్ బాంబ్ విసిరాడని ఆరా తీశారు.
Tamil Nadu: తమిళనాడులో రాజ్‌భవన్‌పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబ్ విసిరిన ఘటన కలకలం రేపింది. రాజ్‌భవన్ ప్రధాన గేటు వద్ద వినోద్ అనే వ్యక్తి పెట్రోల్ ఉన్న రెండు బాటిళ్లను విసిరాడు. వెంటనే వినోద్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పెట్రోల్ బాంబులను వినోద్ ఎందుకు విసిరాడు. అసలు ఇవి అతనికి ఎక్కడ దొరికాయనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. రాజ్‌భవన్‌కు సమీపంలో పార్కింగ్‌లో ఉన్న ఒక బైక్ నుంచి రెండు పెట్రోల్ బాటిల్స్‌ను వినోద్ దొంగతనం చేశాడని చెబుతున్నారు. వాటిని తీసుకుని రాజ్‌భవన్ దగ్గరికి వచ్చి.. మంట పెట్టి విసిరాడని పోలీసులు తెలిపారు.
#WATCH | Tamil Nadu: A petrol bomb was hurled outside Raj Bhavan today in Chennai. A complaint has been lodged in Guindy police station.
ఘటనపై తమిళనాడు బీజేపీ మండిపడుతోంది. గతంలో బీజేపీ ఆఫీస్‌పై వినోద్ దాడి చేశాడని.. తనతో డీఎంకే ఇలా చేయిస్తుందని బీజేపీ చీఫ్ అన్నామలై ఆరోపించారు. ఇదే విషయాన్ని అన్నామలై సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారు. ‘ఈ రోజు రాజ్‌భవన్‌లో పెట్రోల్ బాంబ్ విసరడం తమిళనాడులో శాంతిభద్రతలకు వ్యతిరేకం. డీఎంకే ప్రజల దృష్టిని ఆకర్షించడానికి బిజీగా ఉండగా.. నేరగాళ్లు వీధుల్లోకి వచ్చారని తెలిపారు. గతేడాది 2022 ఫిబ్రవరిలో వినోద్ చెన్నైలో గల బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. ఈ రోజు జరిగిన దాడికి వినోద్ బాధ్యత వహించాలని’ అన్నామలై ట్వీట్ చేశారు.
Petrol bombs were hurled at Raj Bhavan today, reflects the true law and order situation in Tamil Nadu. While DMK is busy diverting the attention of people to insignificant matters of interest, criminals have taken the streets.