Razakar: రజాకార్(Razakar) సినిమా పాత గాయాలను రెచ్చగొట్టడానికి కాదు, కోట్లాది మందికి చరిత్రను చెప్పడం కోసం తీశామని ప్రొడ్యూసర్ గూడూరు నారాయణరెడ్డి(Gudur Narayana Reddy) తెలిపారు. సినిమాను తెలంగాణలో రాష్ట్రంలో విడుదల చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఏవరు ఆపినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పక్కా అని వెల్లడించారు. సినిమా, రాజకీయం రెండు వేరు అని తెలిపారు. సినిమాను చూస్తేనే అధికార పార్టీకి వణుకు పుడుతుందని, రాజకీయంగా వారికి ఈ సారి చావుదెబ్బ తప్పదని వెల్లడించారు. చిత్రం ఎవరు ఆపుతున్నారో తెలుసు అంటున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు జరపడం లేదని ఆడిగారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీతో ప్రేక్షకులతో పంచుకున్నారు.