A.R.Rahman: రామ్ చరణ్‌కి రెహమాన్ మ్యూజిక్.. ఆయన రియాక్షన్ ఇదే..!
బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాజెక్ట్ కు ఇంకా పేరు ఖరారు చేయలేదు. కానీ RC16 గా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో ప్రారంభించే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూట్ డిసెంబర్ 2023 నుండి లేదా 2024 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బుచ్చిబాబు, రామ్ చరణ్(Ramcharan)కు సంబంధించిన సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డైరెక్టర్ బుచ్చి బాబు సానా స్క్రిప్ట్‌ను రెడీ చేసి, రామ్ చరణ్‌తో చర్చించారు. కథ ఆయనకు బాగా నచ్చిందని, అతను చాలా సంతోషంగా ఉన్నాడని సమాచారం. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుందని, విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తారని ఇప్పటికే ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి రెహమాన్(A.R.Rahman) సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. దాని గురించి రెహమాన్ మాట్లాడుతూ, తాను RC16 లో భాగం కావడానికి సంతోషిస్తున్నానని, మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ ఉత్తేజకరమైనదని, దాని గురించి మరిన్ని వివరాలను ఇప్పుడప్పుడే పంచుకోలేనని చెప్పాడు. ఈ చిత్రానికి ప్రత్యేకత ఉందని ఆయన తెలిపారు. కాగా ఆస్కార్ విజేత రెహమాన్ మాటలకు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.