»Bandla Ganesh Admitted To The Hospital What Is The Reason
Bandla Ganesh: ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్..కారణమేంటంటే?
బండ్ల గణేష్ ఆస్పత్రిలో చేరిన వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బండ్లన్నకు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. ఆస్పత్రి బెడ్‌పై బండ్ల గణేష్ సెలైన్ పెట్టుకుని కనిపించిన ఫోటో వైరల్ అవ్వడమే కాకుండా బండ్లన్న చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్(Photo Viral) అవుతోంది. చేతినిండా కుట్లతో, సెలైన్ బాటిల్‌తో బండ్ల గణేష్ ఫోటోలో కనిపిస్తున్నారు. ఆ ఫోటోను చూసిన ఆయన అభిమానులు(Bandla Ganesh Fans) ఆందోళన చెందుతున్నారు. బండ్లన్నకు ఏమైందంటూ నెట్టింట కామెంట్స్(Comments) చేస్తున్నారు.
బండ్ల గణేష్(Bandla Ganesh)కు వైరల్ ఫీవర్ సోకిందని, హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ ఓ పోస్టును షేర్ చేశారు. ‘మిమ్మల్ని కాపాడేందుకు ఎవ్వరూ రారు. ఈ జీవితం మీది. 100 శాతం మీదే బాధ్యత.. బీ సేఫ్’ అంటూ బండ్లన్న ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, నెటిజన్లు కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో కూడా చాలాసార్లు బండ్ల గణేష్(Bandla Ganesh) అనారోగ్యానికి గురయ్యారు. కరోనా సమయంలో మూడుసార్లు వైరస్ బారిన పడి కోలుకున్నారు. కొంత కాలంగా రాజకీయాల్లో ఆయన యాక్టీవ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. భట్టి విక్రమార్క పాదయాత్రలోనూ పాల్గొని తన నినాదాన్ని వినిపించారు. బండ్ల గణేష్ ఆస్పత్రి నుంచి త్వరగా ఇంటికి చేరుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు రీట్వీట్స్ చేస్తున్నారు.