»A Big Burden For Dil Raju And Telugu Film Chamber As Eagle Makers Demand A Solo Release
Eagle Movie: ఈగల్ సోలో రిలీజ్.. దిల్ రాజుకి భారంగా మారిందా..?
రవితేజ ఈగల్ చిత్రాన్ని సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దిల్ రాజు తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని టీమ్‌ని అభ్యర్థించారు.
Eagle Movie: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రవితేజ ఈగల్ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దిల్ రాజు తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని టీమ్‌ని అభ్యర్థించారు. ఫిబ్రవరి 9 న సోలో రిలీజ్ అయ్యేలా చూసుకున్నారు. PMF (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ) బృందం అభ్యర్థనను అంగీకరించింది. వెంటనే వారి చిత్రాన్ని రీషెడ్యూల్ చేసింది. ఒకే రోజు పలు సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈగల్ నిర్మాతలు అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారు. ఫలితంగా టీమ్ ఇప్పుడు వాగ్దానం చేసినట్లుగా తమ చిత్రం సజావుగా విడుదలయ్యేలా చూసేందుకు ఛాంబర్ సహాయాన్ని అభ్యర్థించింది. ఈగిల్ మేకర్స్ సోలో రిలీజ్ డిమాండ్ చేయడంతో ఇప్పుడు దిల్ రాజుకి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కి ఇది భారంగా మారింది.
మొదట 13 జనవరి 2024న థియేటర్లలో షెడ్యూల్ చేయబడిన “ఈగల్” సినిమా విడుదలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని అధికారికంగా ప్రస్తావించడానికి నేను వ్రాస్తున్నాను. ఛాంబర్ మీటింగ్‌లో తెలియజేసి సినిమాను వాయిదా వేయమని నిర్మాతలలో ఒకరు కోరారు. ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా విడుదల తేదీని వాయిదా వేసాము. సోలో తేదీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ తేదీల్లో మరిన్ని సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. మాకు సోలో విడుదలను అందించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శికి నిర్మాతలు ఇలా రేఖ రాయడం విశేషం.
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. యాత్ర 2, ఊరు పేరు భైరవ కోన వంటి చిత్రాలు ఫిబ్రవరి 8, 9 తేదీల్లో విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ ఫిబ్రవరి 9న విడుదల కానుంది.