Salaar: షాకింగ్.. నెల రోజుల్లోపే ఓటిటిలోకి ‘సలార్’
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్‌లో ఉన్నారు. సలార్ హిట్‌తో పాటు సంక్రాంతికి ది రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్, కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ సలార్ ఓటిటి డేట్ అనౌన్స్ చేశారు.
Salaar: ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాతో దాదాపు 750 కోట్ల వరకూ కలెక్షన్స్‌ని రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్. డార్క్ సెంట్రిక్ థీమ్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సలార్’.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అయింది. మిడ్ నైట్ షో నుంచే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద 750 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక సలార్ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తైపోయినట్టే. దీంతో సలార్ ఓటిటి డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు మువీ లవర్స్.
వాస్తవానికైతే.. రిపబ్లిక్ డే సందర్భంగా లేదా ఫిబ్రవరిలో సలార్ స్ట్రీమింగ్కు వస్తుందని అనుకున్నారు. కానీ అంతకన్నా ముందే అభిమానులను నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ చేసింది. సలార్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త చెప్పింది నెట్ ఫ్లిక్స్. రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటిటిలోకి రాబోతోంది సలార్. జనవరి 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటిటి వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో సలార్ సినిమా స్ట్రీమింగ్కు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
అయితే.. హిందీ ఓటిటి విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సలార్ ఓటిటి డేట్‌తో రెబల్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే.. సలార్ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సలార్ నుంచి పార్ట్ 2 ఎప్పుడు బయటకి వస్తుందా? అని సినీ అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సలార్2ని మొదలుపెట్టి.. 2025లోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వం టైటిల్‌తో రానుంది.