నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ‘NBK-111’ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ రెండు వేర్వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ కథతో.. చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీతో రాబోతుంది. తాజాగా ఈ కథ మారినట్లు వార్తలొస్తున్నాయి. ఎపిక్ కథను పక్కనబెట్టి మరో సాలిడ్ కథతో సినిమా చేయనున్నారట. హిస్టారికల్ మూవీకి చాలా టైం పడుతుందని, బడ్జెట్ ఎక్కువవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.