హీరో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయన్ని కలిశారు. కుటుంబసభ్యులతో వెళ్లిన బన్నీని చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు. పుష్ప-2 విజయం తర్వాత మెగాస్టార్ ఇంటికి బన్నీ వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటన, అరెస్టుపై మాట్లాడారు. కాగా.. తొక్కిసలాట ఘటన కేసులో మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.