మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ! నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా ఆనందం, శాంతిని తెచ్చావు.. ప్రతి రోజూ, ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం నీతో మరింత అందంగా ఉంటుంది. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నన్ను డ్యాన్స్ చేసేలా చేసేది నువ్వు ఒక్కదానివే’ అంటూ తన ప్రేమను ఉద్దేశిస్తూ భావోద్వేగపు పోస్ట్ చేశారు.