తాను మొదటిసారి నాగ చైతన్యను ముంబైలోని ఓ కేఫ్‌లో కలిసినట్లు శోభితా ధూళిపాళ్ల తెలిపారు. 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలైనట్లు చెప్పారు. ‘నేను, ఆయన ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించి మా అభిప్రాయాలను పంచుకునేవాళ్లం. ఆయన నన్ను తరుచూ తెలుగులో మాట్లాడమని అడిగేవాడు. నా కోసం చైతన్య ముంబై వచ్చేవాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాము’ అని తెలిపారు.