తరంగ వెంచర్స్ పేరుతో మంచు విష్ణు.. మీడియా ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీల రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ సంస్థలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతున్నట్లు చెప్పారు. కాగా, 50 మిలియన్ డాలర్ల నిధులతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.