ప్రస్తుతం తెలుగు సినిమా.. దేశం దాటి ప్రపంచాన్ని షేక్ చేసే స్థాయికి చేరుకుందని సినీ నటుడు ఉపేంద్ర ప్రశంసించారు. రూ.1000 కోట్లు.. 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. టాలెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లు ఆదరిస్తారని చెప్పారు. తెలుగు వారు ఆదరించే వారిలో తను కూడా ఉండటం సంతోషంగా ఉందని తన ‘యూఐ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.