అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించాడు. మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు. ‘వెల్కమ్ బ్యాక్ అల్లు అర్జున్ గారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు కనబరిచిన ప్రశాంతత, బాధ్యతయుత వ్యవహారశైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తానని మీరిచ్చిన హామీ మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది’ అని పేర్కొన్నాడు.