బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే వారం హృతిక్‌పై ఓ సోలో సాంగ్ చిత్రీకరణకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ముంబై శివార్లలో సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత ఎన్టీఆర్‌పై యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.