టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా అతడికి సమంత స్పెషల్ విషెస్ చెప్పింది. ‘హ్యాపీ బర్త్ డే రానా.. చేసే ప్రతి పనిలో 100 శాతం ఫోకస్ పెడుతుంటావు. ఆ విషయంలో నేను మీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.