బాలీవుడ్ నటి కరిష్మా శర్మ ప్రమాదానికి గురయ్యారు. ముంబైలోని లోకల్ ట్రైన్ నుంచి దూకడంతో ఆమెకు గాయాలయ్యాయి. తన స్నేహితులు రైలు ఎక్కలేదని గమనించిన కరిష్మా.. వేగంగా వెళ్తున్న రైలు నుంచి దూకారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రాగిణి MMS రిటర్న్స్ వెబ్సిరిస్తో కరిష్మా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.