ఇవాళ విడుదలైన ‘మిరాయ్’ VFXపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. ఈ మూవీకి వస్తోన్న స్పందన చూసి హ్యాపీగా ఉందని నిర్మాత విశ్వప్రసాద్ పోస్ట్ పెట్టారు. ‘చిత్రబృందానికి, VFX బృందానికి థ్యాంక్స్. ఇది ప్రారంభం మాత్రమే. మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంఛైజీగా ఎదుగుతుంది. నా కూతురు కృతి నిర్మాతగా నాతో కలిసి నిర్మించిన తొలి మూవీ. ఇది నిజంగా గర్వించదగ్గ, భావోద్వేగభరితమైన మైలురాయి’ అని తెలిపారు.