నటుడు మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి వచ్చారు. తాను పూర్తిగా కోలుకున్న తర్వాత విచారణ చేయాలని మోహన్ బాబు కోరగా.. ఇప్పుడే విచారణకు సహకరించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్ బాబును ప్రశ్నించారు. గన్ను సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. సాయంత్రం సరెండర్ చేస్తానని మోహన్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది.