2024 టాలీవుడ్లో బాక్సాఫీస్ దద్దరిల్లిందనే చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 8 సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ జాబితాలో గుంటూరు కారం (రూ.184 కోట్లు), హనుమాన్ (రూ.296 కోట్లు), టిల్లు స్క్వేర్ (రూ.130 కోట్లు), కల్కి (రూ.1,061 కోట్లు), సరిపోదా శనివారం (రూ.100 కోట్లు), దేవర (రూ.450 కోట్లు), లక్కీ భాస్కర్ (రూ.114 కోట్లు), పుష్ప ది రూల్ (రూ.1110 కోట్లు కౌంటింగ్) ఉన్నాయి.