మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్’. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ను రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.