అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆకాశమే నీ హద్దురా సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తన 25వ సినిమా పనులు ప్రారంభించాడు. అయితే ఈ చిత్రం 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ సరసన హైపర్ బ్యూటీ శ్రీలీల మెరవనున్నది.