ప్రముఖ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఘాటీ’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. 2025 వేసవి కానుకగా ఏప్రిల్ 18న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాను UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.