కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కనున్న ‘యుఐ’ సినిమా తెలుగులో ఈ నెల 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దేశంపై ప్రేమతో ఇలాంటి సినిమాలు చేస్తున్నారా లేక కోపంతోనా అని అడగ్గా, దానికి ఉపేంద్ర సమాధానమిస్తూ దేశం, దేహం రెండు ఒక్కటేనన్నాడు. దేహం బాగుంటే దానిపై ప్రేమ ఉంటుందని, సరిగ్గా లేకుంటే కోపం వస్తుందని, దేశం విషయంలోనూ అంతేనని అన్నాడు.