ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-8 షో ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు వార్తలు రాగా.. ఆయన సంధ్య థియేటర్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ఈ షోకు రావడం లేదట. ఇక ఈరోజు రాత్రి 10 గంటలకు విన్నర్‌ను ప్రకటిస్తారు.