TG: HYD జల్పల్లిలో మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం చోటుచేసుకుంది. మంచు మనోజ్ మహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. జల్పల్లి నివాసంలో స్నేహితులతో కలిసి మనోజ్ పార్టీ చేసుకునేందుకు విద్యుత్ సరఫరాకు జనరేటర్ తెప్పించినట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటుతో అసహనానికి గురైన మంచు విష్ణు తన అనుచరులతో జనరేటర్లో చక్కెర పోయించినట్లు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగింది.