నటుడు మోహన్ బాబు నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి ఘటనపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ‘నిస్సహాయ స్థితిలో నేను మీడియాను లోపలికి తీసుకెళ్లాను. మా ఇంట్లోకి నన్ను అనుమతించకపోవటంతోనే మీడియా ప్రతినిధులను వెంటపెట్టుకుని తీసుకెళ్లాను. లోపలికి వెళ్లాక జర్నలిస్ట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో మీడియా వారి తప్పులేదు’ అని పేర్కొన్నారు.