శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. అయితే ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడలో కూడా దీన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.