నయనతార భర్త విఘ్నేశ్ శివన్ పుదుచ్చేరిలో ప్రభుత్వ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై విఘ్నేశ్ స్పందించాడు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. సినిమా షూట్ కోసం మాత్రమే తాను పుదుచ్చేరి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అదే సమయంలో అక్కడి సీఎంతో పాటు పర్యటక మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు వెల్లడించాడు.