నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్గా ‘అఖండ 2 తాండవం’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కూతురు శ్లోక నటించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కూతురి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ లయను సంప్రదించగా.. అందుకు ఆమె ఒప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.