మూవీలో కంటెంట్ ఉందనిపిస్తే.. నటించడానికి, నిర్మాతగా, ప్రజెంటర్గా వ్యవహరించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని హీరో రానా దగ్గుబాటి. 2010లో ‘లీడర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. బాహుబలితో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. పలు సినిమాల్లో సపోర్ట్ రోల్స్ చేశారు. సినిమాలతో పాటు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా, ఇవాళ రానా దగ్గుబాటి బర్త్ డే సందర్భంగా ప్రముఖులు, అభిమానులు విషెస్ చెబుతున్నారు.