156 చిత్రాల్లో 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చిరుకు అవార్డును ప్రదానం చేశారు. ఆమీర్ మాట్లాడుతూ.. తాను చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పారు. “ఆయన నా సోదరుడిలాంటివారు. ఈ వేడుకకు నన్ను పిలిచినప్పుడు.. విజ్ఞప్తి చేయడమెందుకు ఆర్డర్ వేయండి అన్నాను. ఆయన ప్రతి పాటను ఆస్వాదించి డ్యాన్స్ చేస్తుంటారు” అని కొనియాడారు.