Geyser: ఇంట్లో గీజర్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఒకప్పుడు ఇంట్లో వేడినీళ్లు కాచాలంటే.. కట్టెల పొయ్యి, స్టవ్ వాడేవారు. కానీ ఇప్పుడు అందరు ఇళ్లల్లో గీజర్లు ఉంటున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గీజర్ స్విచ్ఛ్ వేయడం వేడి నీళ్లు వాడటం లాంటివి చేస్తున్నారు. కానీ ఈ గీజర్ ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గీజర్లను సురక్షితంగా వాడటానికి కొన్ని చిట్కాలు
స్నానం చేయడానికి ముందు బాత్ థర్మామీటర్‌తో నీటి ఉష్ణోగ్రతను 120°F (48.9°C) కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.
చిన్న పిల్లలకు స్నానం చేయిపించే ముందు నీటి ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి.
పిల్లలను స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ పర్యవేక్షించండి.
నాన్-స్లిప్ బాత్ మ్యాట్లను ఉపయోగించండి.
గీజర్ భద్రతా నియమాల గురించి ఇంట్లోని ప్రతి ఒక్కరికి తెలియజేయండి.
గీజర్ ఉష్ణోగ్రత
గీజర్ ఉష్ణోగ్రతను 60డిగ్రీలకు మించకుండా సెట్ చేయండి.
ప్రెజర్ కంట్రోల్ ఫీచర్లు ఉండేలా చూసుకోండి.
స్నానం సమయం
చాలాసేపు వేడి నీటిలో స్నానం చేయడం వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది.
గ్యాస్ గీజర్లకు
కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్‌ను ఇన్స్టాల్ చేయండి.
లీక్‌లు, లోపాలను వెంటనే పరిష్కరించండి.
విద్యుత్ ఉపకరణాలను నీటి వనరుల నుండి దూరంగా ఉంచండి.
సాధారణ జాగ్రత్తలు
గీజర్లను ఎక్కువ సేపు ఆన్‌చేసి ఉంచకండి.
లీక్‌లు గమనించినట్లయితే వెంటనే రిపేర్ చేయండి.
ప్రతి రెండేళ్లకోసారి గీజర్లను మార్చుకోండి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు గీజర్లను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.