Heater: చలికాలం ప్రారంభం కావడమే లేటు.. అందరూ చన్నీళ్లకి చెక్ పెట్టి వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. సాధారణంగానే కొంతమందికి చల్లటి నీరు స్నానం నచ్చదు. అలాంటిది శీతాకాలంలో ఇంకా చల్లని నీరు బ్రష్ చేయడానికి కూడా ముట్టుకోరు. ఇంతకు ముందు రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద వేడి నీరు మరగబెట్టేవారు. కానీ ప్రస్తుతం వేడినీరుకు అంత కష్టపడక్కర్లేదు. గీజర్లు, హీటర్లు వంటివి అందుబాటులోకి వచ్చేసాయి. ఇటీవల ఎక్కువ మంది హీటర్‌ను ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా సులభంగా వాటర్‌ను హీట్ చేసుకున్నా.. కొన్ని ప్రమాదాలను మాత్రం కోరి తెచ్చుకుంటున్నారు. మరి హీటర్‌ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
హీటర్‌ను స్నానం చేసే గదిలో కానీ, మనుషులు తిరిగే చోట ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నదగ్గర ఉంచకూడదు. కొంతమంది హీటర్‌ను వాటర్‌లో పెట్టి మర్చిపోతుంటారు. ఆటో స్విచ్చాఫ్ కొన్నింటికి ఉండదు. వీటివల్ల కొన్నిసార్లు షాట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాటర్ హీట్ అయ్యిందో లేదో అని కొందరు స్విచ్ ఆఫ్ చేయకుండానే నీటిలో చేయి పెడతారు. ఇలా చేయడం వల్ల షాక్ కొట్టి చనిపోతారు. కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి ఫ్లగ్ నుంచి వైర్ వేరు చేసిన తర్వాతే వాటర్‌లో చేయి పెట్టాలి. హీట్ తట్టుకునే ప్లాస్టిక్ బకెట్స్ మాత్రమే ఉపయోగించాలి. మెటల్ బకెట్స్ అస్సలు ఉపయోగించకూడదు. అలాగే నాణ్యత కలిగిన హీటర్ కొనుగోలు చేయడం ఉత్తమం.