ఎన్నో ఔషధ గుణాలున్న పప్పులు, కూరగాయలు మన వంటగదిలో దొరుకుతాయి. ఒక్కోసారి ఇందులోని ఔషధ గుణాలు, ఉపయోగం మనకు తెలియవు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు(sadhguru jaggi vasudev) ఈ విషయం గురించి మాట్లాడారు. రోజూ ఉదయాన్నే మొలకెత్తిన మెంతి గింజలను(fenugreek seeds) తినడం వల్ల అనేక రోగాలు దరిచేరవని వారు తెలిపారు.
ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు చాలా గొప్పగా ఎదగాలనే కోరుకుంటారు. అందుకోసం వారికి మనం చిన్నప్పటి నుంచే మంచి ఏదో, చెడు ఏదో చెప్పాలని చూస్తూ ఉంటాం. డబ్బు ఉన్నవారైనా, పేదవారైనా పిల్లల విషయంలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా దీనికి మినహాయింపు కాదు. సామాజిక సేవలో ఎంత బిజీగా ఉన్నా తన పిల్లలను నిర్లక్ష్యం చేయలేదు.
లో బీపీ ఇటీవలి కాలంలో చాలా మందికి సమస్యగా మారింది. హైబీపీ మాత్రమే కాదు, రక్తపోటు తక్కువగా ఉన్నా ఆరోగ్యానికి హానికరం. కాబట్టి లో బీపీ వస్తే ఏం జరుగుతుందో, వెంటనే ఏం తినాలో తెలుసుకోవాలి.
మీరు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలనుకుంటే ఫ్రిజ్ వాటర్ తాగడానికి బదులుగా, చల్లని కుండల నీటిని తాగి మీ దాహాన్ని తీర్చుకోండి. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని సృష్టించే అనేక అంశాలు నేలలో ఉన్నాయి.
సెలబ్రిటీల జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని అనేక మంది అనుకుంటారు. కానీ కష్టాలు, అనారోగ్యం సహా అనేక విషయాల్లో అందరూ ఒక్కటేనని పలు సందర్భాలలో అనిపిస్తుంది. అవును. ఇటివల బాలీవుడ్ నటి బిపాసా బసు నటి నేహా ధూపియాతో జరిగిన వీడియో సంభాషణలో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె పుట్టినప్పుడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిపి కన్నీరు పెట్టుకున్నారు.
ఒత్తైన జుట్టు కోసం ఓ మహిళ బ్యూటీపార్లర్‌ను ఆశ్రయించింది. తన సమస్యను పరిష్కరిస్తామన్న వారి మాటలు నమ్మి ఉన్న జుట్టు పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ICMR ప్రకారం 2022 సంవత్సరంలో భారతదేశంలో 14.6 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.. ఇది 2025 నాటికి 15.7 లక్షలకు పెరగవచ్చు. ఇది ఎంత ప్రమాదకరమో, గత ఏడాది 8 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించారనే వాస్తవాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
నా కొడుకు స్కూల్ నుంచి రాగానే మొబైల్ ఫోన్ పెట్టుకుని కూర్చుంటాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నా కూతురు టీవీ చూస్తుంది. ప్రాక్టీస్ చేయదు. రోజంతా ఆటలు, రీళ్లు, కార్టూన్లలో మునిగిపోయారన్నది నేటి తల్లిదండ్రులందరి పెద్ద ఫిర్యాదు.