»Who Experts Says Ro Water Filters Are Not Good For Health
RO వాటర్ ఫిల్టర్లు ఆరోగ్యానికి మంచిది కాదు: WHO
ప్రస్తుత కాలంలో అనేక మంది రివర్స్ ఆస్మాసిస్ (RO) వాటర్ ఫిల్టర్ల(water filter)ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సైతం ఇదే విషయాలు చెప్పడంతో వీటిని ఉపయోగిస్తున్నవారు భయాందోళన చెందుతున్నారు.
who experts says RO water filters are not good for health
రివర్స్ ఆస్మాసిస్ (RO) వాటర్ ఫిల్టర్ల(water filters) గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల సంచలన విషయం వెల్లడించింది. వీటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని స్పష్టం చేసింది. RO ఫిల్టర్లు నీటిలోని బ్యాక్టీరియాను చంపడమే కాకుండా, కాల్షియం, మెగ్నీషియం వంటి అన్ని లవణాలు, పోషకాలను తొలగిస్తుందని తెలిపింది. ఇటీవల కాలంలో ఆర్ఓ ఫిల్టర్ల వినియోగం వేగంగా పెరుగుతున్న క్రమంలో నిపుణులు ఈ మేరకు హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వం ‘స్వచ్ఛమైన తాగునీటి పేరుతో అనేక ప్రాంతాల్లో RO ప్లాంట్లను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు వారి ఆరోగ్యం పట్ల భయాందోళన చెందుతున్నారు.
నైట్రేట్, ఫ్లోరైడ్ మొదలైనవాటితో అత్యంత కలుషితమైన భూగర్భ జలాలకు RO ప్లాంట్లు మంచిదని మైన్స్ అండ్ జియాలజీ శాఖ మాజీ రసాయన శాస్త్రవేత్త M V శశిరేఖ చెప్పారు. ఇతర వనరుల నుంచి RO ఫిల్టర్ చేసిన నీరు అన్ని అవసరమైన పోషకాలను తొలగిస్తుందన్నారు. కనుక ఇది ప్రతిరోజు వినియోగించడం మంచిది కాదన్నారు. రివర్స్ ఆస్మాసిస్ అయాన్లు, అవాంఛిత అణువులు త్రాగునీటి నుంచి పెద్ద కణాలను తొలగించడానికి పాక్షికంగా పారగమ్య పొరను ఉపయోగిస్తుంది. ఇది సస్పెండ్ చేయబడిన కణాలు, బాక్టీరియా, ఆల్గేలతో సహా నలుసు పదార్థాల సాంద్రతను తగ్గిస్తుంది. దీంతోపాటు కరిగిన, నలుసు పదార్థాల శ్రేణి యొక్క సాంద్రతను తగ్గిస్తుంది.
అయితే కావేరి నీటికి RO ఫిల్టర్ అవసరం ఉండకపోవచ్చని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. కానీ అధిక నైట్రేట్లు కలిగిన బోర్వెల్ నీటికి RO మెమ్బ్రేన్ ఫిల్టరింగ్ అవసరమని అంటున్నారు. ఎందుకంటే నైట్రేట్లను మరిగించడం లేదా ఇతర ఫిల్టర్ల ద్వారా వాటిని తొలగించలేమని చెబుతున్నారు. RO వడపోత, అదే సమయంలో, అవసరమైన అన్ని ఖనిజాలను తొలగిస్తుందన్నారు. బోర్వెల్లపై ఆధారపడిన వారు నీటి నాణ్యతను పరీక్షించి, ఆపై సరైన ఫిల్టర్లను ఉపయోగించాలని శాస్త్రవేత్త శశిరేఖ చెబుతున్నారు.