»Wearing Shoes With Socks Can Cause Health Problem Says Study
Health Tips: సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త ఈ ప్రాబ్లమ్స్ రావొచ్చు ?
ఈ ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీ మాత్రమే కాదు.. మనం తినే, తాగే, బట్టలు వేసుకునే విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా చాలా మారిపోయాయి. ఇంతకుముందు బెల్ బాటమ్ ప్యాంట్స్ ట్రెండ్ అయితే.. ఆ తర్వాత టైట్ జీన్స్ జనాల లైఫ్ స్టైల్ లో చోటు సంపాదించుకుంది. అదేవిధంగా షూల ఫ్యాషన్ ట్రెండ్ కూడా వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు.
Health Tips: ఈ ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీ మాత్రమే కాదు.. మనం తినే, తాగే, బట్టలు వేసుకునే విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా చాలా మారిపోయాయి. ఇంతకుముందు బెల్ బాటమ్ ప్యాంట్స్ ట్రెండ్ అయితే.. ఆ తర్వాత టైట్ జీన్స్ జనాల లైఫ్ స్టైల్ లో చోటు సంపాదించుకుంది. అదేవిధంగా షూల ఫ్యాషన్ ట్రెండ్ కూడా వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు. సాక్స్ లేకుండా బూట్లు ధరించడం హానికరం అని తాజా పరిశోధనలో తేలింది. ఇది పాదాల ప్రమాదాన్ని మాత్రమే కాకుండా ఇతర శారీరక ఆరోగ్య సంబంధిత వ్యాధులను కూడా పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఒక పరిశోధనలో సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే పాదాలు రోజుకు 300 మి.లీ. చెమటను విడుదల చేస్తాయట. పాదం షూలోనే ఉండడం వల్ల ఈ చెమట పూర్తిగా ఆరిపోదు. దీని వల్ల పాదాల్లో తేమ పెరుగుతుంది. దీని కారణంగా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని తేలింది. కొంతమందికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. అందువల్ల అలెర్జీలకు కారణం కావచ్చు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలకు హాని జరగడమే కాకుండా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ఏదైనా షూ వేసుకునే ముందు.. మీరు వేసుకోవాలనుకున్న షూ సరైనదేనని తెలుసుకోవాలి. చాలా గట్టిగా లేదా చాలా వదులుగా ఉన్న బూట్లు ధరించవద్దు. నాణ్యమైన సాక్స్‌లు వాడాలి. ఒక రోజు కంటే ఎక్కువ సాక్స్ ధరించవద్దు.