»Are You Changing Clothes In Front Of Your Children Parents Need To Know
Lifestyle: మీ పిల్లల ముందే ఇలా చేస్తున్నారా..తప్పక తెలుసుకోవాల్సిన విషయం
ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్‌గా అన్ని విషయాలను నేర్చేసుకుంటున్నారు. అది వైపు మంచిదే అయినా కొన్ని సార్లు తల్లిదండ్రులు చేసే పనులు వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. పిల్లలముందే బట్టలు మార్చుకోవడం, నగ్నంగా ఉండడం అసలు మంచి విషయం కాదని చెప్తున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Are you changing clothes in front of your children.. parents need to know
ప్రతి తల్లిదండ్రులు(Parents) తమ పిల్లలతో కలిసి తినడం, కలిసి పడుకోవడం, టైమ్ స్పెండ్ చేయడం లాంటివి చేయాలని నిపుణులు చెప్తారు. చాలా మంది పేరెంట్స్ వీటితో పాటు పిల్లల(Childrens) ముందే బట్టలు మార్చుకుంటారు. పిల్లలతో కలిసి స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పెద్దల శరీరంతో పోల్చితే చిన్న పిల్లల బాడీ తేడాగా కనిపిస్తుంది. అలా ఎందుకు అన్న ప్రశ్నలు వారిలో తలెత్తినప్పుడు తల్లిదండ్రులను అడుగుతారు. అప్పుడు ఆ ప్రశ్నలను దాటవేస్తారు పేరెంట్స్ దానితో పిల్లల ఆలోచనలు డిస్టర్బ్ అవుతాయి అంటున్నారు. కొంత మంది పిల్లలతో కలిసి స్నానం చేస్తారు. ఆ సమయంలో పెద్దల శరీరాలను వారు గమనిస్తారు. దాంతో ఇతరుల ముందు నగ్నంగా ఉండటం తప్పు కాదనే భావన పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ డ్రెస్ లాగేసుకుంటారు. అలాంటి సమయంలో వారికి అర్థం అయ్యే భాషలో చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు.
అలాగే చాలా మంది పేరెంట్స్ హాలులో జనాలు ఉన్నా చిన్న పిల్లలకు బట్టలు మారుస్తుంటారు. అది కూడా వారి ప్రవర్తనలో మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలతో కలిసి స్నానం చేయరు. వారికి ముందే స్నానం చేయిస్తారు. అలా చేయడం ఉత్తమం. నేటి పిల్లలు చాలా మెచ్యూరిటీగా బీహేవ్ చేస్తున్నారు. ఇక కుటుంబంతో కలిసి టీవీ చూస్తున్నప్పుడు, అసభ్యకరమైన సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు వస్తే ఛానెల్ మార్చడం లాంటివి చేస్తే.. పిల్లలు నోటీసు చేసినా పెద్దల ముందు ఛానెల్ మార్చాలని నేర్చుకుంటారు. లేదంటే అది ఫ్రీడమ్‌గా భావించే ఛాన్స్ ఉంది. అలాగే చిన్నపిల్లలు ఏదైనా అసభ్యకరమైన ప్రశ్నలు వేసినా వారికి అర్థం అయ్యేలా చెప్పాలని అంటున్నారు. ఆ సమయంలో పేరెంట్స్ చెప్పే సమాధానం వారి మైండ్‌లో ఉండిపోతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం అని చెప్తున్నారు.