»Virat Kohli Took A Revenge On Gautam Gambhir For His Crowd Silencing Gesture
Virat Kohli : గంభీర్ పై రివేంజ్ తీర్చుకున్న విరాట్ కోహ్లీ..!
గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ స్వీట్ రివేంజ్ తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో జెయింట్స్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ స్వీట్ రివేంజ్ తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో జెయింట్స్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ లో కోహ్లీ.. గంభీర్ పై ప్రతీకారం తీర్చుకోవడం గమనార్హం. మామూలుగానే కోహ్లీకి ఎవరైనా తనను రెచ్చగొట్టినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా అస్సలు ఊరుకోడు. ప్రతికారం తీర్చుకోకుండా ఉండడు. ఇప్పుడు తాజాగా గంభీర్ తాను బదులు ఇచ్చాడు.
ఏప్రిల్ 10న బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 212 రన్స్ చేయగా.. లక్నో చివరి బంతికి విజయాన్ని అందుకుంది. 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో.. స్టోయినిస్ (30 బంతుల్లో 65), పూరన్ (19 బంతుల్లో 62) విధ్వంసంతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
మ్యాచ్ ఆసాంతం ఆర్సీబీ ఫ్యాన్స్ తమ జట్టుకు మద్దతుగా నిలిచారు. దీంతో లక్నో గెలిచిన అనంతరం గౌతమ్ గంభీర్ నోటి మీద వేలు వేసుకొని.. హుష్.. ఇక నోరు మూసుకోండి అన్నట్టుగా సైగ చేశాడు. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. అయితే.. నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో ని ఓడించిన తర్వాత కోహ్లీ కూడా నోటిపై వేలు పెట్టి.. హూష్ ఇక నోరు మూనుకోండి అన్నట్లు గా ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ఇంకేముందు.. కోహ్లీ బలే రివేంజ్ తీర్చుకున్నాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.