ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్(UPI Payments) వసూలు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.14.07 లక్షల కోట్లు కావడం గమనార్హం. మార్చి నెలతో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైనట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్(UPI Payments) వసూలు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.14.07 లక్షల కోట్లు కావడం గమనార్హం. మార్చి నెలతో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైనట్లు తెలుస్తోంది. మేనెల చివరి మూడు రోజుల్లోనే దాదాపు రూ.1.37 లక్షల కోట్లు లావాదేవీలు(UPI Payments) జరిగాయి. 100 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2022 ఏప్రిల్ నెలతో పోలిస్తే గత నెలలో ట్రాన్సాక్షన్ల విలువ ప్రకారంగా 59 శాతం పెరిగింది. గత ఏడాదిలో ఏప్రిల్ లో 558 కోట్ల లావాదేవీలు జరగ్గా అందులో రూ.9.8 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి.
మరోవైపు గత నెలలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వద్ద టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్లు చాలా వరకూ తగ్గాయని అధికారులు తెలిపారు. గత నెల మార్చిలో ఫాస్టాగ్ లావాదేవీలు(Fastag Payments) 306.3 మిలియన్లు నమోదైతే, ఏప్రిల్లో 0.47 శాతం తగ్గి 305 మిలియన్లకే పరిమితం అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.5067 కోట్ల నుంచి రూ.5149 కోట్లకు లావాదేవీలు జరిగాయని అధికారులు తెలిపారు.