ఐపీఎల్ లో భాగంగా తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు, అభిమానులు తరలివచ్చారు. పలువురు ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. నటులు విక్టరీ వెంకటేశ్, ఆర్య హుషారుగా పాల్గొన్నారు.
కష్టాల్లో ఉన్న జట్టుకు తిలక్ వర్మ చేసిన పోరాటం వృథాగా మారింది. కాగా గత సీజన్ లో ముంబై పేలవ ప్రదర్శన ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. మరి లోటుపాట్లు సరిదిద్దుకుని గతానికన్నా కాస్త మెరుగయ్యామని నిరూపిస్తారో లేదో వేచి చూడాలి.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు(Rajasthan Royals)..సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad)పై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 8 వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.
మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొనబోతుంది. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు వేసింది.
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని ప్రకటించారు.
MS Dhoni : ఐపీఎల్ 2023 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి వరకు సాగింది. అయితే చివర ఆఖరికి గుజరాత్ టైటాన్స్ గెలిచింది. చెన్నై పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే... ఈమ్యాచ్ లో సరికొత్త రికార్డు సాధించారు.
ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్‌లో బోణీ కొట్టి ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియన్ సన్ జట్టుకు దూరం అవనున్నారు. నిన్నటి మ్యాచ్‌లో బాల్ ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డ సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలతో అహ్మదాబాద్‌లో గల నరేంద్ర మోడీ స్టేడియం దద్దరిల్లిపోయింది. రష్మిక మందన్నా, తమన్నా డ్యాన్సులతో హోరెత్తించగా.. సింగర్ అర్జిత్ సింగ్ పాటలతో మైమరపించారు.
ఐపీఎల్ ప్రారంభోత్సవం జోష్ గా సాగింది. హీరోయిన్లు తమన్నా (Tamanna), రష్మిక మందాన్న (Rashmika Mandanna), అర్జిత్ సింగ్ (Arjit Singh) అదిరిపోయే ప్రదర్శనలతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తింది. చాలా రోజుల తర్వాత ఆ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.
IPL ఆరంభం అదిరిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ తొలి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. సీఎస్కే తరఫున రుతురాజ్ గైక్వాడ్ చేసిన భారీ స్కోర్ వృథాగా మారింది. ఐపీఎల్ ఆరంభోత్సవంలో తమన్నా, రష్మిక మందాన్న, అర్జిత్ సింగ్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
weather changed at ahmedabad:అహ్మదాబాద్ (Ahmedabad) నరేంద్ర మోడీ (narendra modi) స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలపై వర్ష ప్రభావం పడనుంది. నిన్ననే సిటీలో చాలా చోట్ల వర్షం కురిసింది. ఈ రోజు వర్షం పడితే ఆరంభ వేడుకలే కాదు.. మ్యాచ్ జరిగే అవకాశం ఉండదు.
IPL 2023:ఆదిలోనే సన్ రైజర్స్ (SUN RISERS) హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచ్‌కు సన్ రైజర్స్ కెప్టెన్ సహా మరో ఇద్దరు అందుబాటులో ఉండటం లేదు. ఈ మ్యాచ్‌కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.