ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలతో అహ్మదాబాద్‌లో గల నరేంద్ర మోడీ స్టేడియం దద్దరిల్లిపోయింది. రష్మిక మందన్నా, తమన్నా డ్యాన్సులతో హోరెత్తించగా.. సింగర్ అర్జిత్ సింగ్ పాటలతో మైమరపించారు.
IPL opening ceremony:ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలతో అహ్మదాబాద్‌లో గల నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium) దద్దరిల్లిపోయింది. రష్మిక మందన్నా (rashmika), తమన్నా (tamannah) డ్యాన్సులతో హోరెత్తించగా.. సింగర్ అర్జిత్ సింగ్ (arjit singh) పాటలతో మైమరపించారు. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్ స్ట్రీమ్ కాగా.. ప్రేక్షకులు టీవీలు/ మొబైల్స్‌కు అతుక్కుపోయారు.
ఐపీఎల్ 2023 (IPL 2023 )లో సినీ తారలు తళుక్కుమన్నారు. ప్రముఖ గాయకుడు అర్జీత్ సింగ్ ‘కేసరియా’ పాటతో ప్రారంభ వేడుకలను ప్రారంభించారు. ఆ పాటకు డ్యాన్స్ చేయమని అభిమానులను కోరగా.. కేకలు, ఈలలతో స్టేడియం మారుమోగింది.
తెలుగు పాటలతో (Telugu Songs) స్టేడియం హోరెత్తిపోయింది. తమన్నా భాటియా (Tamannah Bhatia ), రష్మిక మందన్నా (Rashmika Mandanna ) తెలుగు పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు. పుష్ప ( Pushpa) మూవీలో గల ఊ అంటవా ఊఊ అంటవా పాటకు తమన్నా స్టెప్పులేయగా స్టేడియం మొత్తం విజిల్స్‌తో హోరెత్తింది. ఆ తర్వాత రష్మిక సామీ సామీ పాటకు స్టెప్పులు వేశారు. ఆస్కార్ సాధించిన నాటు నాటు పాట ( Naatu Naatu) పాటకు కూడా రష్మిక మందన్నా డ్యాన్స్ చేశారు.
రష్మిక మందన్నా (rashmika) రెండు తెలుగు పాటలు సామీ సామీ (sami sami), నాటు నాటు ( Naatu Naatu) పాటకు డ్యాన్స్ చేయగా.. తమన్నా (tamannah) ఊ అంటావా మావా పాటకు డ్యాన్స్ చేశారు. స్టేడియంలో మొత్తం తెలుగు పాటలే మారుమోగాయి. ఇతర రాష్ట్రంలో తెలుగు పాటలకు (telugu songs) ప్రేక్షకుల (fans) నుంచి మంచి స్పందన వచ్చింది.