భూమికి సమీపంలో ఓ బుల్లి చందమామను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ‘2025 పీఎన్7’ అని పేరు పెట్టారు. అయితే, నిజానికి అదొక గ్రహశకలం. ఇది సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. దీనికి కూడా సూర్యుడిని చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతోంది. గత నెల 29న హవాయ్‌లోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ దీనిని గుర్తించింది. ఇది భూమి సమీప కక్ష్యలో దశాబ్దాలుగా పరిభ్రమిస్తోందని వెల్లడైంది.