KMM: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కర్నాటి కృష్ణయ్య జైలులో ఉండి కూడా MLAగా గెలిచి చరిత్ర సృష్టించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం నైజాం నవాబులకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. సాయుధ పోరాట దినోత్సవం సందర్భంగా కృష్ణయ్య ధైర్యసాహసాలను ఆయన కుమారుడు భాను ప్రసాద్ గుర్తు చేశారు. ఆయనను సజీవంగా పట్టిస్తే రూ.10 వేలు ఇస్తామని నిజాంలు ప్రకటించారని తెలిపారు.