W.G: 2వ రోజు అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గళం వినిపిస్తుండగా.. విప్లు మాట్లాడుకుంటూ ఉండడాన్ని తప్పుబట్టారు. విప్లు కాస్త మాటలు తగ్గించాలన్నారు. అత్యవసరమైతే బయటికి వెళ్లిపోవాలని సూచించారు. అలా కాదని సభలో గందరగోళం సృష్టిస్తూ అంతరాయం కలిగించవద్దని ఆయన మనవి చేశారు.