తమిళ నటుడు రోబో శంకర్ మృతిపై కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. ‘రోబో శంకర్.. నీ పేరులో ఉన్న రోబో ఒక ముద్దు పేరు మాత్రమే. నువ్వు నా తమ్ముడివి. నువ్వు లేని లోటు మమ్మల్ని బాధపెడుతున్నా.. నువ్వు మా నుంచి దూరంగా వెళ్లిపోయావు. నీ పని పూర్తిచేసుకుని వెళ్లావు. కానీ నా పని ఇంకా మిగిలి ఉంది. రేపటిని మాకోసం వదిలి వెళ్లిపోయావు. కాబట్టి రేపు మనదే’ అంటూ పోస్ట్ పెట్టారు.