AP: తిరుపతిలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. కరకంబాడి రోడ్డులోని ఓ వైన్‌షాప్‌లో మద్యం తాగిన యువకులు.. మద్యం సేవిస్తున్న మరో ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేశారు. అనంతరం కరకంబాడి నుంచి నేరుగా అమెరికన్ బార్ వద్దకు చేరుకుని వెకిలిచేష్టలు చేశారు. దీంతో స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.