ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ను శుక్రవారం తాడిపత్రి నేత, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేశ్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. అలాగే రాప్తాడు, శింగమల నియోజకవర్గాలకు తనను పరిశీలకుడిగా నియమించినందకు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట స్థానిక నేతలు ఉన్నారు.