WNP: జిల్లాలో భూ రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు సర్వేయర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిమ్యానాయక్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్లో సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఎఫ్-లైన్ దరఖాస్తులను నిర్దిష్టగడువులోపు పూర్తిచేయాలని మండల సర్వేయర్లను ఆదేశించారు. భూదాన, ప్రభుత్వ భూములకు సంబంధించిన GIS మ్యాపింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.